శ్రీశైలంలో రోప్ వే, బోట్ షికారు పునఃప్రారంభం

కర్నూలు: శ్రీశైలంలో టూరిజం రోప్ వే, బోట్ షికారు పునః ప్రారంభించారు. కరోనా మహమ్మారితో రెండు నెలలుగా బోటు షికారు నిలుపుదల చేశారు.
కరోనా కేసులు తగ్గి సాధారణ స్థితికి చేరుకోవడంతో భక్తుల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్ టూరిజం మళ్లీ టూరిజం రోప్ వే, బోట్ షికారు ప్రారంభించింది.

అన్ని రకాల చర్యలు తీసుకుని, తగిన ఏర్పాట్లు చేసి తిరిగి రోప్ వే ను పునః ప్రారంభిస్తున్నట్లు టూరిజం మేనేజర్ పెంచల్ రెడ్డి తెలిపారు. పాతాల గంగ సమీపంలోని హరిత హోటల్ వద్ద రోప్ వే ఉంది. ఒక రోప్ వే బాక్స్ లో నలుగురు కూర్చోవచ్చు. ఐదు నిమిషాల పాటు పర్యటించే ఈ రోప్ వే లో నల్లమల అందాలు, కృష్ణా జలాల పరవళ్లు వీక్షించవచ్చు. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహిస్తారు. పెద్దలకు రూ.50, చిన్నారులకు రూ.35 చొప్పున ఛార్జి విధిస్తా

Leave A Reply

Your email address will not be published.