యూరప్ లో పెరుగుతున్న డెల్టా కేసులు: డబ్ల్యూహెచ్ఓ

జెనివా:యూరప్ దేశాల్లో డెల్టా వేరియంట్ వైరస్ కేసులు పెరుగుతున్నాయి. పది వారాల తరువాత మళ్లీ పాజిటివ్ కేసులు పుంజుకున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసింది.

డెల్టా వేరియంట్ నియంత్రణ కోసం ఆంక్షలు అమలు చేస్తున్నప్పటికీ పెరుగుతుండడంతో ఆ దేశాల ప్రభుత్వాలు తర్జనభర్జనపడుతున్నాయి. వ్యాక్సిన్ వేసుకుని డిజిటల్ సర్టిఫికెట్ ఉన్నవారు మాత్రమే ఆ దేశాల్లో పర్యటించాలనే నిబంధన అమల్లో ఉంది. బ్రిటన్ నుంచి జర్మనీ, ఫ్రాన్స్, పోర్చుగల్, ఇటలీ, స్పెయిన్ దేశాలకు వెళ్తున్న వారికి కఠిన ఆంక్షలు అమలుపరుస్తున్నారు. డెల్టా వేరియంట్ తీవ్రత కారణంగా బ్రిటన్ లో మరో నాలుగు వారాల పాటు లాక్ డౌన్ పొడిగించారు. రష్యా లో కూడా డెల్టా వేరియంట్ తీవ్రత పెరిగింది.

Leave A Reply

Your email address will not be published.