రేవంత్… నిన్ను చెప్పులతో కొట్టాలి: చిరుమర్తి లింగయ్య

హైదరాబాద్: కాంగ్రెస్ ను వీడి టిఆర్ఎస్ లో చేరిన వాళ్లను రాళ్లతో కొట్టే ముందు నిన్న చెప్పులతో కొట్టాలని టిఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పిసిసి చీఫ్ ఏ.రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కౌంటర్ ఇచ్చారు.

ఓటుకు నోటు కేసులో దొరికిన రేవంత్ రెడ్డి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీలో చేరాని, అప్పుడు ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. ఆయన ఇప్పటికీ నాలుగు పార్టీలు మారారని, ఇక్కడ కూడా ఏమీ లేకపోతే భవిష్యత్తులో మరో పార్టీలోకి మారతారన్నారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ తో కోట్ల రూపాయలు పోగేసుకున్నారని మండిపడ్డారు. ఆ డబ్బులను ఢీల్లీలోని పెద్దలకు పంచిపెట్టి పిసిసి అధ్యక్ష పదవి తెచ్చుకున్నరన్నారని లింగయ్య ఆరోపించారు.

Leave A Reply

Your email address will not be published.