గృహ నిర్బంధంలో రేవంత్ రెడ్డి

హైదరాబాద్: నగర శివారు కోకాపేటలో వేలం వేసిన ప్రభుత్వ భూములను పరిశీలించేందుకు ఇవాళ వెళ్లనున్న పిసిసి అధ్యక్షుడు ఏ.రేవంత్ రెడ్డిని గృహ నిర్భందం చేశారు.
ఆదివారం రాత్రి నుంచే జుబ్లిహిల్స్ లోని ఆయన నివాసం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మొహరించారు. ఆయనతో పాటు కార్యకర్తలు కూడా వెళ్లకుండా పోలీసులు కట్టడి చేశారు.

ఇవాళ కోకాపేట వెళ్లి నిరసన తెలిపేందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి, మాజీ మంత్రి దామోదర రాజనర్సింహ, కె.మహేష్ గౌడ్ సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో తెల్లవారు జాము నుంచే ముఖ్య నాయకులను అరెస్టు చేశారు. అదే విధంగా కోకాపేట ప్రాంతానికి వెళ్లే రహదారులపై పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు. సిఎం కెసిఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, సిద్ధిపేట జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ్ రెడ్డి భూముల వేలం పాటలో అక్రమాలకు పాల్పడ్డారని రేవంత్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. తమకు తెలిసిన వారికి భూములు కట్టబెట్టేందుకు, ఇతరులు వేలం లో పాల్గొనకుండా ఉండేందుకు సిద్ధిపేట జిల్లా కలెక్టర్ బెదిరింపులకు పాల్పడ్డారన్నారు. కలెక్టర్ సోదరుడి రియల్ ఎస్టేట్ సంస్థ రాజపుష్ప వేలం పాటలో పాల్గొని ప్లాట్ దక్కించుకుందని అన్నారు. ఈ వేలం పాటలో ప్రభుత్వం రూ.1వేయి కోట్లు నష్టపోయిందని, ఆధారాలు త్వరలో బయటపెడతానని రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన విషయం విదితమే.

Leave A Reply

Your email address will not be published.