పెద్దమ్మ గుడి లో రేవంత్ పూజలు
హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడిగా నియమితులైన ఏ.రేవంత్ రెడ్డి ఇవాళ ఉదయం జూబ్లిహిల్స్ పెద్దమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇవాళ ఉదయం తన నివాసం నుంచి బయలుదేరి 10 గంటలకు పెద్దమ్మ దేవాలయానికి చేరుకున్నారు. పూజలు ముగించుకున్న తరువాత ర్యాలీగా బయలుదేరి నాంపల్లి గాంధీ భవన్ చేరుకున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు రేవంత్ నూతన అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ర్యాలీలో ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్యే కె.జానారెడ్డి ఉన్నారు.