వందల సంఖ్యలో మాల్వేర్ యాప్ ల తొలగింపు

శాన్ ఫ్రాన్సిస్కో: గూగుల్ ఈ మధ్యకాలంలో భద్రతలేని యాప్ లను ప్లే స్టోర్ తొలగిస్తున్నది. ఈ మధ్యకాలంలో కొన్ని యాప్ ల ద్వారా ఫోన్లలో చొరబడి సమాచారం దొంగిలిస్తూ హ్యాకర్లకు చేరవేస్తున్నారు.

ఇలాంటి యాప్ లను గుర్తించి గూగుల్ జల్లెడ పడుతున్నది. వ్యక్తిగత సమాచారం మొదలు ఆర్థిక లావాదేవీలు, కార్డుల వివరాలు కూడా లాగేస్తున్నాయి. ఇటువంటి మాల్వేర్ పై గూగుల్ నాలుగేళ్లుగా పనిచేస్తున్నది. జోకర్ మల్వేర్ ఉన్న యాప్ లను కొద్ది రోజులుగా గుర్తించి తొలగిస్తున్నది. అయినప్పటికీ దీని అరాచకం తగ్గడం లేదు. హ్యాకర్లు ఎప్పటికప్పుడు జోకర్ మాల్వేర్ ను అప్ డేట్ చేస్తూ కొత్తగా ప్రయోగిస్తున్నారు. దీంతో నిపుణులకు కూడా చిక్కడం లేదు. అప్ డేట్ వెర్షన్లతో వస్తుండడంతో వాటిని నిలువరించడానికి సైబర్ నిపుణులు నానా తంటాలు పడుతున్నారు. దాన్ని తొలగించే లోపే మరో అప్ డేట్ వెర్షన్ వస్తున్నది. ఇటీవల వచ్చిన మాల్వేర్ కెమెరా, ఫొటో ఎడిటింగ్, ప్రాసెసింగ్ మెసెంజర్, వాల్ పేపర్ యాప్ లను లక్ష్యంగా చేసుకుంటున్నది. వాటి ద్వారా ఫోన్లలోకి చొరబడుతున్నది. జోకర్ మాల్వేర్ ఉన్న 1800 యాప్ లను తాజాగా గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి తొలగించింది.

Leave A Reply

Your email address will not be published.