రిమోట్ కంట్రోల్ తుపాకీ వచ్చేసింది!

చెన్నై: తిరుచ్చిలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఘనత సాధించింది. సముద్ర జలాల గస్తీ సిబ్బంది కోసం సరికొత్త తుపాకీని తయారు చేసింది. రిమోట్ సాయంతో ఈ తుపాకీని వినియోగించవచ్చు.

తిరుచ్చిలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని 1966 లో ప్రారంభించారు. దేశీయంగా కేంద్ర, రాష్ట్రాల భద్రతా బలగాలకు అవసరమైన వెపన్స్ తయారు చేస్తుంటారు. బుల్లెట్ ఫ్రూప్ వాహనాలు, జాకెట్లు, రక్షణ పరికరాలు కూడా కొత్తవి ఆవిష్కరిస్తుంటారు. సముద్రతీరాల్లో గస్తీ సిబ్బందికి అవసరమైన తుపాకీని తయారు చేసి ఇచ్చారు. 12.7 మిల్లి మీటర్ల స్టెబిలైజ్డు రిమోట్ కంట్రోల్ గన్ గా పేరు పెట్టారు. దీన్ని నౌకల పై భాగంలో అమర్చి, నౌక లోపల నుంచే దీన్ని ఆపరేట్ చేయవచ్చు. రాత్రి పగలు అనే తేడా లేకుండా నిర్ధేశించిన టార్గెట్ ను పూర్తి చేయవచ్చు. దీనికి సిసిటివి కెమెరా, లేజర్ రేంజ్ బైనాక్యూలర్స్ అమర్చారు. ఈ తుపాకీతో రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ ను షూట్ చేయవచ్చు. రక్షణ శాఖ సిబ్బంది పలుమార్లు పరీక్షించి ఓకే చెప్పారు. ఈ లాంగ్ డిస్టాన్స్ రిమోట్ కంట్రోల్ టెక్నాలజీని ఇజ్రాయెల్ దేశం నుంచి తీసుకున్నారు. ఈ గన్ ను శనివారం నాడు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఛైర్మన్ విశ్వకర్మ నౌకాదళ అధికారులకు అందచేశారు

Leave A Reply

Your email address will not be published.