ఇండియాలో డెల్టా ప్లస్ దడ దడ
న్యూఢిల్లీ: ఇండియాలో డెల్టా ప్లస్ వైరస్ కేసుల నమోదు క్రమంగా మొదలవుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రాలలో స్వల్ప కేసులు బయటపడగా ఈశాన్య రాష్ట్రాల్లో కూడా వెలుగులోకి వస్తున్నాయి.
త్రిపురలో 90 డెల్టా ప్లస్ కేసులను గుర్తించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. లక్షణాలు ప్రత్యేకంగా కన్పించడంతో 151 మంది నుంచి నమూనాలు సేకరించారు. వాటిని పశ్చిమ బెంగాల్ కు పరీక్షల కోసం పంపించగా 90 మందికి డెల్టా ప్లస్ వైరస్ సోకినట్లు నిర్థారణ అయ్యింది. మరికొన్ని నమూనాల్లో డెల్టా, ఆల్ఫా వేరియంట్ లక్షణాలు బయటపడ్డాయి. కొత్త వేరియంట్లు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖలు అప్రమత్తమయ్యాయి. కేసుల నియంత్రణ కోసం రెండు రోజుల పాటు కర్ఫ్యూ విధించింది. శనివారం మధ్యాహ్నం నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటుందని ప్రకటించారు.