గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు

అమరావతి: గ్రామ సచివాలయాల్లోనే స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ కు ఏపి ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తొలి దశలో జిల్లాల వ్యాప్తంగా ఎంపిక చేసిన సచివాలయ కార్యదర్శులకు, డిజిటల్ ఆపరేటర్లకు శిక్షణ ప్రారంభించారు.
మరి కొన్ని జిల్లాల్లో జూలై 1వ తేదీ నుంచి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 44 రోజుల పాటు రెవెన్యూ, సబ్‌రిజిస్ట్రార్‌, మున్సిపల్‌, సచివాలయాల్లో ఎలాంటి రిజిస్ట్రేషన్స్‌ వస్తాయి..

ఆస్తి మదింపులు ఎలా లెక్కించాలి.. రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు ఎలా నిర్ణయించాలి, అసైన్డ్‌, ప్రభుత్వ, దేవాదాయ భూములు ఎలా గుర్తించాలి.. రిజిస్ట్రేషన్‌ సమయంలో పొందుపరచాల్సిన పత్రాలు.. తదితర విషయాలపై అవగాహన కల్పిస్తారు. ప్రస్తుతం శిక్షణ పొందుతున్న వారు ఇతర సచివాలయాల సిబ్బందికి శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. త్వరలోనే సచివాలయాల్లో సైతం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జరగనుందని అధికారులు తెలిపారు. సాఫ్ట్‌వేర్‌లో సైతం తదనుగుణంగా మార్పులు చేశారు. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌ ఇక సులభతరం కావడమే కాకుండా ఎప్పటికప్పుడు క్రయ, విక్రయాలు జరిగిన వెంటనే రికార్డుల బదలాయింపులు జరగడంతో వివాదాలకు ఆస్కారం తగ్గుతుందన్నారు.

Leave A Reply

Your email address will not be published.