రేపటి నుంచే నీట్ దరఖాస్తుల స్వీకరణ

న్యూఢిల్లీ: నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్టు (నీట్) -2021 ను సెప్టెంబర్ 12 వ తేదీ నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. పరీక్షలు పూర్తిగా కరోనా నిబంధనల ప్రకారం నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.

జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ వెబ్ ఫోర్టల్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగస్టు 1వ తేదీన పరీక్ష జరగాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ తో సెప్టెంబర్ 12వ తేదీకి వాయిదా పడింది.

Leave A Reply

Your email address will not be published.