రూ.2 లక్షలు కొరికేసిన ఎలుకలు
మహబూబాబాద్: కూరగాయల వ్యాపారి రోజు రోజు కూడబెట్టిన సొమ్ము ను ఎలుకలు కొరికేశాయి. వైద్యం కోసం ఖర్చు చేసుకునేందుకు వాటిని దాచి పెట్టాడు. ఈ ఘటన వేమునూరు గ్రామం ఇందిరానగర్ తండాలో జరిగింది.
భూక్యా రెడ్యా కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వైద్య ఖర్చుల కోసం గత కొద్ది నెలలు గా పోగు చేయగా రూ.2 లక్షలు అయ్యాయి. వాటిని సరిగ్గా భద్రపర్చకపోవడంతో ఒక్క నోటును కూడా వదిలేయకుండా చిల్లకల్లం చేశాయి. కొరికిన నోట్లను తీసుకుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచికి వెళ్లగా, నోట్లు చెల్లుబాటు కావని చెప్పారు. ఇక ఏం చేయలేక బోరుమంటూ ఇంటికి చేరుకున్నాడు. తన వైద్యానికి సాయం చేయాలని అధికారులను భూక్యా రెడ్యా వేడుకుంటున్నాడు.