టిఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్న రమణ
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ కు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సభ్యత్వం ఇచ్చారు. టిఆర్ఎస్ భవన్ లో కెటిఆర్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేల సంజయ్ కుమార్, ఎంపి బడుగు లింగయ్య, పార్టీ నాయకులు పాల్గొన్నారు. సుమారు ఏడేళ్ల పాటు రమణ తెలంగాణ టిడిపి అధ్యక్షుడిగా కొనసాగారు. రాష్ట్రంలో ఇక పార్టీకి మనుగడ లేకపోవడంతో ఆయన టిఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.