ఏపిలో రానున్న మూడు రోజులు వర్షాలే

అమరావతి: వాతావరణ విభాగం సూచనల ప్రకారం పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతం ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరప్రాంతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది.
దీని ప్రభావంతో ఈరోజు ఓ మోస్తారు వర్షాలు ఆదివారం, సోమవారం కురవనున్నాయి. తీరం వెంబడి గంటకు 50-60 కీ.మీ వెగంతో గాలులు వీయడంతో సముద్రం అలజడిగా ఉంటుంది. మత్స్యకారులు మంగళవారం వరకు సముద్రంలోకి వేటకు వెళ్లరాదంటూ సూచించారు. రాగల మూడు రోజుల వాతావరణ వివరాలు ఇలా ఉన్నాయి.

శనివారం నాడు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు మిగిలినచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. ఆదివారం రోజున కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ భారీ వర్షాలు మిగిలిన చోట్ల మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రజలను కోరింది.

Leave A Reply

Your email address will not be published.