రాహుల్, పికె ఫోన్ల ట్యాపింగ్ కలకలం

న్యూఢిల్లీ: జర్నలిస్టులు, మంత్రులే కాకుండా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయి. ఇజ్రాయెల్ కు చెందిన పెగాసస్ స్పైవేర్ తో ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని వాషింగ్టన్ పోస్టు, గార్డియన్ లో కథనాలు వచ్చాయి.

దీనిపై ఇవాళ పార్లమెంటులో దుమారం రేగింది. స్పై వేర్ తో రాహుల్ తో పాటు ప్రశాంత్ కిశోర్, కేంద్ర ఐటి మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ట్యాపింగ్ బారినపడ్డారు. పశ్చిమ బెంగాల్ సిఎం కుమారి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఫోన్ కూడా ట్యాప్ చేసినట్లు వెల్లడైంది. ప్రపంచ వ్యాప్తంగా 17 వార్తా సంస్థలు పెగాసస్ ప్రాజెక్టు పేరుతో చేసిన పరిశోధనాత్మక కథనాలు తరువాతి భాగం ఇవాళ ప్రచురించాయి. పికె ఫోన్ చేసింది నిజమేనని, ఆయన ఫోన్ ను అమ్నెస్టీ ఇంటర్నేషనల్ చెందిన సెక్యూరిటీ ల్యాబ్ లో పరీక్షలు చేసినట్లు వార్తలొస్తున్నాయి. 2018 నుంచి 2019 ఎన్నికల ముందు వరకు పికె ఫోన్ ట్యాప్ అయినట్లు ఫోరెన్సిక్ పరీక్షల్లో వెలుగు చూసింది. ఇందులో 40 మంది జర్నలిస్టుల డేటా హ్యాక్ అయినట్లు స్పష్టమైంది. ఇజ్రాయెల్ కు చెందిన ఎన్ఎస్ఓ సంస్థ తన నిఘా సాఫ్ట్ వేర్ ను ప్రభుత్వాలకు మాత్రమే విక్రయిస్తాయి.

Leave A Reply

Your email address will not be published.