కరోనా ఉధృతిపై సిఎంలతో ప్రధాని సమావేశం

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కొన్ని రాష్ట్రాల్లో విజృంభిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇవాళ ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. సెకండ్ వేవ్ ఇంకా తగ్గుముఖం పట్టకపోగా, కొన్ని దేశాల్లో థర్డ్ వేవ్ కూడా ప్రారంభమైంది. ఈ సమావేశంలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, థర్డ్ వేవ్ ముప్పు తదితర అంశాలపై చర్చించనున్నారు. ఆసుపత్రులలో మౌలిక సదుపాయాల కల్పన, ఆక్సిజన్ కొరత లేకుండా చూడడం, వైద్య సదుపాయాల పెంపు పై ముఖ్యమంత్రులతో ఆరా తీయనున్నారు. కరోనా నిబంధనలు ఎలా అమలు చేస్తున్నారు, ఏ జిల్లాల్లో కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి, ఏ చర్యలు తీసుకోవాలనేది ప్రధాని మోదీ ముఖ్యమంత్రులను అడిగి తెలుసుకోనున్నారు.

Leave A Reply

Your email address will not be published.