శ్రీశైలం డ్యాం వద్ద పోలీసుల పహారా

హైదరాబాద్: శ్రీశైలం డ్యాం వద్దకు తెలంగాణ పోలీసులు భారీగా చేరుకున్నారు. ఎడమగట్టు గేటు వద్ద పోలీసు బలగాలతో పహారా కాస్తున్నారు.
రెండు రాష్ట్రాల మధ్య గత వారం రోజులుగా మాటల యుద్దం నడుస్తోంది. హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ జల వివాదాలను రాజేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఈటల రాజేందర్ ను ఓడించి, టిఆర్ఎస్ ను గెలిపించేందుకు జల వివాదాలు సృష్టించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీశైలం జలాశయంలోని నీటి నిల్వలపై ముదురుతున్న ఏపీ తెలంగాణ నీటి వివాదం జరుగుతుండటంతో ముందస్తుగా శ్రీశైలం జలాశయం ఎడమ గట్టు గేటు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం వద్ద విద్యుత్ ప్లాంట్‎లోకి వెళ్లే వాహనాలను, సిబ్బందిని తెలంగాణ పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి పంపిస్తున్నారు.
జూరాల మీద రాకపోకలు నిషేదం

జూరాల ప్రాజెక్టు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఈ రోజు ఉదయం నుంచి జూరాల మీద రాకపోకళ్లు నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజుల కిందా గద్వాల జిల్లా ఎస్పీ రంజన్‌రతన్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు జలవిద్యుత్ కేంద్రాన్ని, జూరాల ప్రాజెక్టును సందర్శించారు. ఇరు రాష్ట్రాల మద్య నెలకొన్న జల వివాదం కారణంగా జూరాల మీద పూర్తి స్థాయిలో రాకపోకలు నిలిపివేయనున్నట్లు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.