శివశంకర్ బాబా పై పోక్సో చట్టం ప్రయోగం

చెన్నై: సుశీల్ హరి ఇంటర్నేషనల్ స్కూలు విద్యార్థినులపై లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన శివశంకర్ బాబా పై పోక్సో చట్టం ప్రయోగించనున్నారు. తమిళనాడు పోలీసులు ఈ చట్టం ప్రయోగించేందుకు తగిన ఆధారాలు సేకరించారు.
కేళంబాక్కం సమీపంలోని పుదుపాక్కం వద్ద శివశంకర్ బాబా సుశీల్ హరి ఇంటర్నేషనల్ స్కూలు నడుపుడుతున్నాడు. భక్తి ముసుగులో ఎందరో అమ్మాయిలను లైంగికంగా లోబర్చుకున్నాడని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు.

వారిలో కొందరు అమ్మాయిలు ధైర్యం చేసి తమిళనాడు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా లైంగిక లీలలు వెలుగులోకి వచ్చాయి. 18 మంది పూర్వ విద్యార్థినులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిబి సిఐడి పోలీసులు శివశంకర్ బాబాను అరెస్టు చేసి విచారిస్తున్నారు. తనపై ఫిర్యాదులు చేశారని తెలియగానే శివశంకర్ పరారీ అయి ఉత్తరాఖండ్ లోని డెహ్రడూన్ లో తేలాడు. అక్కడ ఒక హాస్పిటల్ లో చేరి చికిత్స తీసుకుంటుండగా సిబి సిఐడి పోలీసుల ప్రత్యేక బృందం అక్కడకు వెళ్లింది. పోలీసులు వస్తున్నారని తెలియడంతో అక్కడి నుంచి పరారీ అయి న్యూఢిల్లీ చేరాడు. న్యూఢిల్లీలో గత నెల 16న ఆయనను అదుపులోకి తీసుకుని చెన్నై తరలించి చెంగల్పట్టు మెజిస్ట్రేట్ ముందు ప్రవేశ పెట్టారు.

Leave A Reply

Your email address will not be published.