ఏపి సిఎం జగన్ పై తెలంగాణ హైకోర్టులో పిల్

హైదరాబాద్: ఆంధ్రా ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి పై వైసిపి ఎంపి కె.రఘురామ కృష్ణ రాజు తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) వేశారు. జగన్ అక్రమాస్తుల కేసుల్లో సిబిఐ, ఈడి సక్రమంగా దర్యాప్తు చేయడం లేదని పిటిషన్ లో ఆరోపించారు.

ఇప్పటికే ఆయన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో కేసు వేయగా విచారణ జరుగుతోంది. తాజాగా ఆయన జగన్ అక్రమ ఆస్తుల కేసు విచారణ పై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దర్యాప్తులో భాగంగా తమ దృష్టికి వచ్చిన పలు అంశాలను ఉద్దేశపూర్వకంగా వదిలిపెట్టాయని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసులకు ఆధారాలను సేకరించడంతో పాటు, ముగింపు ఇవ్వడంలో సిబిఐ, ఈడి పూర్తి వైఫల్యం చెందాయన్నారు. విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగా దర్యాప్తు చేసేలా రెండు సంస్థలను ఆదేశించాలని తన పిటిషన్ లో ఎంపి రఘురామ కోరారు.

Leave A Reply

Your email address will not be published.