మంత్రులు, జర్నలిస్టుల ఫోన్లు హ్యాకింగ్

న్యూఢిల్లీ: పెగాసస్ స్పై వేర్ తో కొంత మంది మంత్రులు, జర్నలిస్టుల ఫోన్లు హ్యకింగ్ గురయ్యాయన్న వార్త సంచలనం సృష్టించింది. ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లు కూడా హ్యాకింగ్ అయ్యాయని వాషింగ్టన్ పోస్టు, గార్డియన్ వంటి అంతర్జాతీయ పత్రికలు ప్రత్యేక స్టోరీలు ప్రచురించాయి.

రెండేళ్ల క్రితం వాట్సప్ యూజర్లను పెగాసస్ స్పై వేర్ వణికించింది. మళ్లీ తాజాగా ఈ స్పైవేర్ ను ఉపయోగించడం గమనార్హం. ప్రభుత్వాలు ఈ స్పై వేర్ ను ఉపయోగించి ఎలా సమాచారం రాబడుతున్నయో పత్రికలు వివరించాయి. ఇవి ప్రభుత్వాల ఆధీనంలో ఉండడంతో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోని 40 మందికి పైగా జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, మంత్రుల ఫోన్లు హ్యాక్ అయినట్లు కథనంలో వెల్లడించారు. ఇండియాలో కేంద్ర ప్రభుత్వం సహా 10 రాష్ట్ర ప్రభుత్వాలు పెగాసెస్ స్పైవేర్ ఉపయోగిస్తున్నాయి. అయితే గార్డియన్, వాషింగ్గన్ పోస్టు కథనాలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఇది భారత ప్రజాస్వామ్యాన్ని అగౌరవ పరిచేలా, ప్రతిష్ట దిగజార్చేలా ఉందని ఆరోపించింది. అయితే తాము పెగాసెస్ స్పైవేర్ ను ఉపయోగిస్తున్నామా లేదా అనేది మాత్రం తన ప్రకటనలో స్పష్టం చేయలేదు.

Leave A Reply

Your email address will not be published.