ఏపిలో థియేటర్లకు అనుమతి

అమరావతి: రెస్టారెంట్లు, జిమ్స్, కళ్యాణ మండపాలు, సినిమా థియేటర్లు… ఇలా అన్నిచోట్లా కోవిడ్‌ ప్రోటోకాల్స్‌తో అనుమతించారు. జనం ఉండేచోట కచ్చితంగా సీటుకు సీటుకు మధ్య ఖాళీ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు చేశారు.
శానిటైజర్, మాస్క్, భౌతిక దూరం తప్పనిసరి గా పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. కోవిడ్‌ విస్తరణను పరిగణలోకి తీసుకుంటూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు చేశారు.

తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ కర్ఫ్యూ సడలింపులు ఉంటాయి. సాయంత్రం 6 గంటలకు దుకాణాల మూసివేయాల్సి ఉంటుంది. పాజిటివిటీ రేటు 5 లోపు వచ్చేంతవరకూ ఆంక్షల కొనసాగించాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. మిగిలిన జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటలవరకూ సడలింపులు అమల్లో ఉంటాయి. రాత్రి 9 గంటలకే దుకాణాల మూసివేయనున్నారు. సీటుకు, సీటుకు మధ్య ఖాళీ ఉండేలా థియేటర్లకు అనుమతించడంతో త్వరలోనే ప్రారంభం కానున్నాయి.

 

Leave A Reply

Your email address will not be published.