కాంగ్రెస్ ఇంటి దొంగలకు డెడ్ లైన్: రేవంత్ రెడ్డి
నిర్మల్: హుజూరాబాద్ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కు అయి కోవర్టుగా మారాడని, కాంగ్రెస్ లో ఇంటి దొంగలను వదిలే ప్రసక్తి లేదని పిసిసి అధ్యక్షుడు ఏ.రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
ఇంటి దొంగలు ఎవరైనా ఉంటే ఈ నెలాఖరు వరకు డెడ్ లైన్ విధిస్తున్నా, వెళ్లిపోవాలని ఆయన స్పష్టం చేశారు. లేదంటే కుట్రలు, కుతంత్రాలు మార్చుకుని కొనసాగవచ్చని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే వాడిని గుండెల్లో పెట్టుకుంటామన్నారు. ఏకపక్ష నిర్ణయాలు ఉండవని, అందరం కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకుంటామన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ టికెట్ తనకే వస్తుందని ఒక టిఆర్ఎస్ నాయకుడి తో మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. దీనిపై చర్యలు తీసుకోవాలని క్రమ శిక్షణా సంఘం సన్నద్ధం కావడంతో కౌశిక్ రెడ్డి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాకు ముందే క్రమశిక్షణా సంఘం ఆయనపై బహిష్కరణ వేటు వేసింది.