భూ కుంభకోణంలో సోమేష్ పాత్ర: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలంగాణ లో కొనసాగే అర్హత లేదని పిసిసి అధ్యక్షుడు ఏ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బిహార్ రాష్ట్రానికి చెందిన సోమేశ్ కుమార్ ఏపీ క్యాడర్ కు చెందిన అధికారి అని అన్నారు.

గతంలో సోమేశ్ కుమార్ ఐఏఎస్ ఉద్యోగం వదిలి బయట ఉద్యోగం చేశారన్నారు. చేస్తున్న ఉద్యోగం వదిలి మళ్ళీ వస్తే ఇచ్చారన్నారు. సిఎం కెసిఆర్ చెప్పినట్లు సోమేశ్ కుమార్ చేస్తుండు కాబట్టే ప్రధాన కార్యదర్శి పదవిలో కొనసాగతున్నారన్నారు. కోకాపేట, ఖానామెట్ భూ కుంభకోణంలో ఆయన పాత్ర ఉందన్నారు. ఆయనపై కోర్టులో కేసు ఉందని, ఆ కేసు ఫైల్ కనిపించడం లేదన్నారు. ఏపికి కెటాయించినా వెళ్లకుండా ఇక్కడ ప్రధాన కార్యదర్శిగా చేయడం శోచనీయమన్నారు. తెలంగాణ వాళ్లు ఏపిలో పనిచేస్తున్నా వెనక్కి తీసుకురాకుండా, ఏపికి చెందిన అధికారులను కెసిఆర్ తెలంగాణలో కొనసాగిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Leave A Reply

Your email address will not be published.