డ్రోన్ దాడిలో పాక్ ఐఎస్ఐ హస్తం?

న్యూఢిల్లీ: జమ్మూలోని మిలిటరీ ఏయిర్ ఫోర్స్ స్టేషన్ తో పాటు మరో ప్రాంతంలో జరిగిన డ్రోన్ దాడిలో దాయాది దేశం పాకిస్థాన్ కుట్రలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
జూన్ 27వ తేదీన ఏయిర్ ఫోర్స్ స్టేషన్ పై డ్రోన్ దాడి జరిగిన విషయం తెలిసందే. ఈ దాడిలో రెండు డ్రోన్లను ఉపయోగించగా, ఒక డ్రోన్ లో ఆర్.డి.ఎక్స్ ను ఉపయోగించగా మరో డ్రోన్ లో బాల్ బేరింగ్ లను ఉపయోగించారు.

తీవ్రతను పెంచడానికి ఆర్.డి.ఎక్స్ తో పాటు బాల్ బేరింగ్ లను ఉపయోగించారని భద్రతావర్గాలు అంచనాకు వచ్చాయి. వీటిలో వాడిన ప్రెజర్ ఫ్యూజులు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. శతఘ్నులు, మోర్టార్ బాంబుల్లో ఈ ఫ్యూజులను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇలా చేయడం మూలంగా గాల్లో పేలకుండా నిర్ధేశించిన లక్ష్యం వద్దే పేలుతుంటాయి. ఈ స్థాయి శక్తి తీవ్రవాదుల వద్ద ఉండదని, కచ్చితంగా పాకిస్థాన్ సైన్యం మద్దతు ఉంటుందనేది భారత నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అన్ని కోణాల్లో విచారించిన తరువాత పాకిస్థాన్ ఐఎస్ఐ హస్త ఉండవచ్చనే నిర్థారణకు అధికారులు వచ్చారు.

Leave A Reply

Your email address will not be published.