దేశ సరిహద్దుల్లో పాక్ సెల్ టవర్లు

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో గొడవలు జరుగుతున్న సమయంలో ఇంటర్ నెట్ సేవలను నిలిపివేస్తున్నది. ఈ సమయంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెల్ టవర్లు, టీవి టవర్ల ద్వారా సంఘ వ్యతిరేక శక్తులకు సిగ్నల్స్ ఇస్తున్నారు.
భారత సరిహద్దుల్లో నిర్మించిన హై సిగ్నల్ టవర్లను పాకిస్థాన్ ఏర్పాటు చేసింది. జమ్మూ దాడి నేపథ్యంలో హోం శాఖ ముఖ్య అధికారులు తాజా పరిస్థితిపై సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో సెల్ టవర్లు, టీవి టవర్ల ఏర్పాటై అందోళన వ్యక్తం చేశారు.

దేశంలో అలజడులు రేపేందుకు పాకిస్థాన్ తనకున్న మార్గాల్లో ఎప్పటికప్పుడు కుట్రలు అమలుపరుస్తున్నది. జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల ఎన్ కౌంటర్లు నిర్వహించిన సందర్భంలో ఇంటర్ నెట్, టివి సిగ్నల్స్ ను నిలిపివేస్తారు. ఈ సమయంలో ఉగ్రమూకలు, పాక్ సానుభూతి పరులకు నిరంతరాయం ఇంటర్ నెట్ అందేలా సరిహద్దుల్లో 38 ప్రాంతాల్లో హై సిగ్నల్ టవర్లను ఏర్పాటు చేసింది. పాకిస్థాన్ స్పెషల్ కమ్యునికేషన్ ఆర్గనైజేషన్ ఈ పనులను చూస్తున్నది. వీటితో పాటు టీవి కార్యక్రమాలకు కూడా అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేశారు. భారత్ పై విషం చిమ్మేందుకు వీటిని వినియోగిస్తున్నారని హోం శాఖ ఉన్నతాధికారులు నిశ్చిత అభిప్రాయానికి వచ్చారు. టవర్ల విషయంలో ఏం చేయాలనే దానిపై విస్తృతంగా చర్చలు జరిగాయి.

Leave A Reply

Your email address will not be published.