పెగాసెస్ స్పైవేర్ పై ప్రతిపక్షాల ఆందోళన

ఢిల్లీ: ఇజ్రాయెల్ దేశానికి చెందిన పెగాసెస్ స్పైవేర్ దేశాన్ని కుదిపేస్తున్నది. ఈ సాఫ్ట్ వేర్ సాయంతో కేంద్ర ప్రభుత్వంతో పాటు కొన్ని రాష్ట్రాలు మంత్రులతో పాటు జర్నలిస్టులు, ముఖ్య నాయకుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు.

దీనిపై కేంద్రాన్ని నిలదీసేందుకు ఇవాళ పార్లమెంటులో రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశం కొద్ది సేపటి క్రితం ముగిసింది. పెగాసస్ స్పైవేర్‌ అంశాన్ని ఉభయసభల్లో లేవనెత్తాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. సమావేశంలో కాంగ్రెస్‌తో పాటు టిఎంసి, ఆర్జేడి, డిఎంకే పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. వైసిపి, టిఆర్ఎస్, బిజెడి, జనతాదళ్ యునైటెడ్, బిఎస్పి నాయకులు పాల్గొనలేదు. దీనిపై మధ్యాహ్నం గం. 2.00కు మరోసారి సమావేశం నిర్ణయించారు. ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ సెంట్రల్ హాలులో నిర్వహించే కరోనా ప్రజెంటేషన్‌లో పాల్గొనాలో లేదా అన్న అంశంపై విపక్షాలు చర్చించి నిర్ణయం తీసుకోనున్నాయి.

Leave A Reply

Your email address will not be published.