రోడ్డుపై పరుగెత్తిన ఓలా స్కూటర్

ఓలా పేరు వినే ఉంటారు. ఈ సంస్థ క్యాబ్ సర్వీసులను అందిస్తున్నది. ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమలోకి ఈ సంస్థ అడుగుపెట్టింది. త్వరలో ఓలా స్కూటర్ ను బహిరంగ మార్కెట్ లోకి తీసుకువచ్చేందుకు సన్నాహలు చేస్తున్నది.

బెంగళూరు రోడ్లపై తిరుగున్న వీడియోను ఓలా సిఈఓ భవిష్ అగర్వాల్ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి ఫీచర్లు వెల్లడించారు. అతి తక్కువ సమయంలో గంటకు 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఛార్జ్ అయిపోగానే మార్చుకునేందుకు వీలుగా లిథియం అయాన్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. సీటు కింది భాగంలో రెండు హెల్మెట్లు పెట్టుకునేంతగా ఖాళీ ఉంది. టెలి స్కోపిక్ సస్పెన్షన్ తో చూడచక్కని డిజైన్ తో తీర్చిదిద్దారు. ఒకసారి ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్లు పరుగెడుతుంది. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తుతుంది.
తమిళనాడులో రూ.2,400 కోట్లతో ఫ్యాక్టరీ పనులు కొనసాగుతున్నాయి. ప్రతి ఏడాది ఒక కోటి స్కూటర్లను తయారు చేసి మార్కెట్ లో విక్రయించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. దేశ వ్యాప్తంగా హైపవర్ ఛార్జర్ నెట్ వర్క్ ను ఏర్పాటు చేస్తున్నారు. హై స్పీడ్ ఛార్జింగ్ టెక్నాలజీని అందుబాటులోకి తెస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.