వ్యాక్సిన్ పై అపోహలు వద్దు: వివేక్ మూర్తి

వాషింగ్టన్: కరోనా వైరస్ కారణంగా తన కుటుంబంలో పది మంది ప్రాణాలు కోల్పోయారని, ఆ బాధ చెప్పలేనంత వర్ణనాతీతం అని ఎన్ఆర్ఐ అమెరికన్ సర్జన్ డాక్టర్ వివేక్ మూర్తి అన్నారు.

చనిపోయిన వారిలో కొందరు ఇండియాలో, మరికొందరు అమెరికాలో ఉండేవారన్నారు. వ్యాక్సిన్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయనే ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని, ధైర్యంగా ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారి ఇంకా పోలేదని, పూర్తిగా వ్యాక్సినేషన్ అయితే తప్ప విముక్తి లభించదన్నారు. అమెరికాలో ఇప్పటి వరకు 16 కోట్ల మంది వ్యాక్సిన్లు వేయించుకున్నారని, ఇది గొప్ప విషయమన్నారు. ప్రభుత్వం ప్రతి ఒక్క పౌరుడికి ఉచితంగా వ్యాక్సిన్లు వేస్తున్నదని ప్రశంసించారు. అందరూ అనుమానాలు వీడి వ్యాక్సిన్లు వేసుకుంటే వైరస్ కు కళ్లెం పడుతుందని వివేక్ మూర్తి స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.