వచ్చే ఏడాది భారీ విజువల్ వండర్
మణిరత్నం దర్శకత్వంలో బారీ విజువల్ వండర్ చిత్రం తెరకెక్కుతున్నది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీస్తున్నారు. సుప్రసిద్ధ రచయిత కల్కి రాసిన నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.
మొదటి భాగాన్ని 2022లో విడుదల చేయడనున్నట్లు లైకా ప్రొడక్షన్స్, మణిరత్నం మద్రాస్ టాకీస్ లు ఇవాళ ప్రకటించారు.
అయితే ఇందులో ప్రధాన తారాగణం ఎవరనేది ఇంకా వెల్లడించచలేదు. అయితే చిత్రీకరణ మాత్రం జరుగుతోంది. అయితే అగ్రతారలు నటిస్తున్నారని మాత్రం ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకుంటుందనే నమ్మకంతో ప్రొడక్షన్ సంస్థలు అంటున్నాయి. కథనం జై మోహన్ కాగా సంగీతం ఏఆర్.రెహమాన్ అందిస్తున్నారు.