సీమ అక్రమ పథకాలపై తదుపరి విచారణ 23న
చెన్నై: ఏపీ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలపై తెలంగాణ రాష్ట్రం తరఫున నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో దాఖలైన ధిక్కరణ పిటిషన్ పై ఇవాళ వాదనలు జరిగాయి.
గతంలో సీమ ప్రాజెక్టుపై గవినోళ్ల శ్రీనివాస్ వేసిన పిటిషన్పై విచారణను ఎన్జిటి ఇవాళ్టికి వాయిదా వేసింది. కానీ, ఇవాళ విచారణకు రాకపోవడంతో తాము కూడా ధిక్కరణ పిటిషన్ వేశామని తెలంగాణ ఏఏజీ రామచందర్ రావు తెలిపారు. గతంలో జారీ చేసిన ఆదేశాల ప్రకారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు క(కెఆర్ఎంబి), కేంద్రపర్యావరణ శాఖ ప్రాజెక్టును సందర్శించి నేడు నివేదిక సమర్పించాల్సి ఉందన్నారు. కానీ, తనిఖీ చేయకుండా ఏపీ ప్రభుత్వం అడ్డుకోవడంతో నివేదిక ఇవ్వలేదని ఎన్జిటి కి రామచందర్ రావు తెలిపారు. వాదనలు విన్న ఎన్జిటి 23న రాయలసీమ ఎత్తిపోతలపై విచారణ జరుపుతామని తెలిపింది.