ఇదేమి పని కియారా… ఒళ్లు బద్దకమా!

ముంబయి: బాలీవుడ్ భామ కియారా అద్వానీ పై నెటిజన్లకు చిర్రెత్తుకొచ్చినట్లు ఉంది. సిద్ధార్థ మల్హోత్రా ఇంటికి వెళ్లిన సందర్భంగా ఒక వృద్ధుడు ఆమె కారు డోరు తెరిచిన వీడియో షేర్ అయ్యింది.

ఇంకేముందు ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆమె పై భగ్గుమంటున్నారు. సెలబ్రిటీలు తమకు తాము గొప్పగా ఫీలవుతుంటారు. ఒక వృద్ధుడితో డోరు తెరిపించుకోకపోతే మీరు తెరుచుకోలేనంత పెద్దవాళ్లు అయ్యారా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆ కామెంట్లపై పలువురు పలు రకాలుగా స్పందించారు. కియారా అద్వానీ ప్రస్తుతం హిందీలో పలు సినిమాలను చేస్తున్నది. ఈ మధ్య సిద్ధార్థ మల్హోత్రాతో పీకల్లోతు ప్రేమలో పడింది. త్వరలోనే ఇద్దరూ పెళ్లి చేసుకుంటారనే టాక్ విన్పిస్తున్నది. ఎప్పటికప్పడు తన వీడియోలను చేస్తూ యూత్ ను కట్టిపడేస్తున్నది.

Leave A Reply

Your email address will not be published.