నారప్ప విడుదల ఈరోజు రాత్రి
విక్టరీ వెంకటేష్ అభిమానులు నారప్ప సినిమా కోసం కొద్ది రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. అనుకున్నట్లుగానే ఈ రోజు రాత్రి10 గంటలకు అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేస్తున్నారు.
కరోనా విజృంభిస్తున్న ఈ రోజుల్లో మన కుటుంబ సభ్యులనే థియేటర్ కు పంపించడంలేదని నిర్మాత డి.సురేశ్ బాబు తెలిపారు. అలాంటిది ప్రేక్షకులను సినిమా థియేటర్లకు రమ్మనడం భావ్యం కాదని భావిస్తున్నామన్నారు. థియేటర్లు తెరిచినా జనం వస్తారో లేదోనని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయాలని నిర్ణయించామన్నారు. అభిమానులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు.