నారప్ప… ఒటిటిని వ్యతిరేకిస్తున్న అభిమాని!
కరోనా మహమ్మారి సమయంలో సినిమా థియేటర్లు మూతపడ్డాయి. ఇప్పట్లో తెరుచుకునేలా లేవు. విడుదలకు సిద్ధంగా ఉన్న వాటిని ప్రేక్షకుల ముందుకు తీసుకురాకుండా ఆపలేని పరిస్థితి ఉంది.
రిలీజు చేయకుండా ఆగితే ఖర్చులు తడిసిమోపెడు అయ్యే ప్రమాదముండడంతో నిర్మాతలు ఒటిటి కి వెళ్లక తప్పడం లేదు. చాలా రోజుల తరువాత వెంకటేష్ మువీ నారప్ప విడుదలకు సిద్ధమైంది. ఈ విషయాన్ని నిర్మాత, దర్శకుడు ప్రకటించాడు. వరంగల్ కు చెందిన అభిమాని నారప్ప మువీ ని ఒటిటిలో విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాడు. ఒటిటి లో రిలీజు చేస్తున్నందుకు నిరసనగా నిరాహార దీక్ష కు దిగాడు.