రెండు జిల్లాల పేర్లు మార్పు

హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటన మేరకు రెవెన్యూ శాఖ రెండు జిల్లాల పేర్లను మార్పు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వరంగల్ రూరల్ ను వరంగల్ గా, వరంగల్ అర్బన్ ను హనుమకొండగా మార్పు చేసింది.

హనుమకొండ జిల్లా పరిధిలో హనుమకొండ, పర్కాల్ రెవెన్యూ డివిజన్లు ఉండగా, వరంగల్ జిల్లా పరిధిలో వరంగల్, నర్సంపేట రెవెన్యూ డివిజన్లను చేర్చారు. రెండు జిల్లాల్లో రెవెన్యూ గ్రామల వారిగా జాబితాను కూడా విడుదల చేశారు. కెసిఆర్ ఇటీవల వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్లిన సందర్భంగా రెండు జిల్లాల పేర్లను మార్చాలని జిల్లా ప్రజా ప్రతినిధులు కోరారు. ప్రజా ప్రతినిధుల కోరిక మేరకు పేర్లను మార్చుతున్నట్లు ప్రకటించిన కెసిఆర్, త్వరలోనే ఆదేశాలు జారీ చేస్తామని ప్రకటించారు.

Leave A Reply

Your email address will not be published.