బిజెపి నేత సువేందు పై మర్డర్ కేసు నమోదు
కొలకతా: పశ్చిమ బెంగాల్ బిజెపి శాసనసభాపక్షం నేత సువేందు అధికారి పై మర్డర్ కేసు నమోదు అయ్యింది. తన భర్త మరణంపై విచారించాలని బాడీగార్డు సుబ్రత చక్రవర్తి భార్య సువేందు అధికారిపై మర్డర్ కేసు పెట్టింది.
భార్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు మళ్లీ దర్యాప్తు ప్రారంభించారు. సువేందు వద్ద బాడీగార్డుగా పనిచేస్తున్న సుబ్రత చక్రవర్తి 2018, అక్టోబర్ 13వ తేదీన తన సర్వీసు రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వెంటనే సహచర భద్రతా సిబ్బంది ఆయనను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రెండు రోజుల తరువాత చనిపోయాడు. సుబ్రత చక్రవర్తి ఆత్మహత్య చేసుకున్న సమయంలో సువేందు అధికారి మమతా బెనర్జీ కేబినెట్ లో రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. తన భర్త మరణానికి సువేంద కారణమని భార్య ఫిర్యాదులో ఆరోపించింది. పూర్తి స్థాయిలో విచారణ జరిగితే సువేందు పాత్ర బయటపడుతుందని ఆమె పోలీసులను కోరింది. పోలీసులు ప్రత్యేక కేసుగా పరిగణించి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.