ముంబయి ఏయిర్ పోర్టు అదానీ పరం

ముంబయి: దేశంలోని ప్రముఖ కంపెనీ అదానీ గ్రూపు చేతుల్లోకి ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం వెళ్లింది. ముంబయి ఇంటర్నేషనల్ ఏయిర్ పోర్టు లిమిటెడ్ నిర్వహణలో ఉన్న ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జివికె గ్రూపునకు ఉన్న 50.5 శాతం వాటా తో పాటు మరో 23.5 శాతం వాటాను అదానీ కైవసం చేసుకున్నది.

అదానీ కొనుగోలుకు సంబంధించింది లావాదేవీలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ఆమోదించి అనుమతించడంతో మంగళవారం నాడు ఈ ప్రక్రియ పూర్తయింది. దీంతో ముంబయి విమానాశ్రయ యాజమాన్య హక్కులు తమ వశమైనట్లు అదానీ గ్రూపు ప్రకటించింది. వచ్చే నెల నవీ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని, 90 రోజుల్లో నిధుల సమీకరణ పూర్తి చేసి 2024 కల్లా విమానాశ్రయాన్ని అందుబాటులోకి తెస్తామని వెల్లడించింది. ముంబయి ఏయిర్ పోర్టు లో వాటాల విక్రయంతో దేశీయ విమానాశ్రయ రంగం నుంచి జివికె గ్రూపు పూర్తిగా వైదొలిగింది.

 

Leave A Reply

Your email address will not be published.