జల వివాదం ఒక డ్రామా: ఎంపి కేశినేని
విజయవాడ: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం పెద్ద డ్రామా అని, హుజూరాబాద్ ఉప ఎన్నికల కోసమేనని విజయవాడ ఎంపి కేశినేని నాని ఆరోపించారు. ఎన్నికల ముందు, తరువాత సిఎం కెసిఆర్, జగన్ రెడ్డి మధ్య పరస్పర సహాయ సహకారాలు ఉన్నాయన్నారు.
రెండు రాష్ట్రాల ప్రజలను పిచ్చోళ్లను చేసి ఆడుకుంటున్నారని కేశినేని నాని ధ్వజమెత్తారు. హైదరాబాద్ నగరంలో తన ఆస్తులు కాపాడుకునుంకు కెసిఆర్ తో కలిసి డ్రామా చేస్తున్నారన్నారు. ఆంధ్రా ప్రజలు ఈ డ్రామాలు గమనించలేనంత పిచ్చోళ్లు కాదని అన్నారు. ఇప్పటికైనా ఈ నాటకాలు కట్టిపెట్టి హైదరాబాద్ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇద్దరి మధ్య సఖ్యత ఉన్నప్పుడు కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారమవుతాయని నాని అన్నారు.