రూ.50వేలకు పసికందును అమ్మెసిన తల్లి

నిజామాబాద్: అప్పుడే పుట్టిన బిడ్డకు రక్తహీనత సమస్యలు రావడం, చేతిలో డబ్బులు లేకపోవడంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది. ఏం చేయాలో అర్థం కాక ఆ బిడ్డను నెల రోజులు తరువాత విక్రయించింది.

ఈ ఘటన నిజమాబాద్ జిల్లాలో చోటు చేసుకున్నది.
ఇందూర్ లో ఒక మహిళ నెల రోజు క్రితం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీతో పాటు బిడ్డకు రక్తహీనత సమస్యలు వచ్చాయి. మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించారు. చేతిలో డబ్బులు లేకపోవడం, బిడ్డ బతకేదేమోనన్న బెంగతో తల్లి రూ.50వేలకు బేరం కుదుర్చుని ఇచ్చేసింది. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో 9 మందిని అదుపులోకి తీసుకుని, బిడ్డను స్వాధీనం చేసుకుని ఐసిడిఎస్ అధికారులకు అప్పగించారు.

Leave A Reply

Your email address will not be published.