పెళ్లి కొడుకును చెప్పుతో కొట్టిన తల్లి

లక్నో: తన కుమారుడు పొరుగింటి యువతిని పెళ్లి చేసుకోవడాన్ని సహించలేని తల్లి వివాహ వేదికపైనే చెప్పుతో కొట్టింది. ఈ ఘటన ను పెళ్లికి వచ్చిన ఆహ్వానితులు, బంధువులు చూసి షాకయ్యారు.

హమీర్ పూర్ జిల్లా భరువా సుమేర్ లో ఈ ఘటన జరిగింది. శివానీ ప్యాలెస్ లో నివాసం ఉంటున్న ఉమేష్ చంద్ర పొరుగింటిలో ఉంటున్నఅంకితను ప్రేమించాడు. రిజిష్టర్ మ్యారేజీ చేసుకుని ఇంటికి తీసుకురావడంతో తల్లిదండ్రులతో పాటు సోదరుడికి ఆగ్రహం తెప్పించింది. అయితే అంకిత తండ్రి వీరి వివాహం ఘనం జరిపించాలని నిర్ణయించుకుని బంధువులు, స్నేహితులను ఆహ్వనించాడు. అయితే ఈ వివాహానికి పెళ్లి కొడుకు తల్లిదండ్రులను ఆహ్వానించలేదు. వివాహం జరుగుతున్న సమయానికి వరుడి తల్లి ముఖంపై వస్త్రం కప్పుకుని వేదిక వద్దకు చేరుకున్నది. వధూవరులు దండలు మార్చుకోగానే ఆమె తన కుమారుడిని చెప్పుతో నాలుగు కొట్టింది. ఈ ఘటనను చూసిన వారంతా అవాక్కయ్యారు. ఆ తరువాత ఆమె వేదిక దిగి వెళ్లిపోగా, అక్కడున్నవారు ఏం జరుగుతోందంటూ చర్చించుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.