వర్షాకాలం…. వజ్రపాత్ డౌన్ లోడ్ చేసుకోండి!

హైదరాబాద్: ఈ మధ్య పిడుగుల సమస్య ఎక్కువైంది. భారీ వర్షాలు, తుఫాన్లు పడే సమయంలో పిడుగులు పడడం మూలంగా మూగ జీవాలతో పాటు మనుషుల ప్రాణాలు పోతున్నాయి.

ఈ సమస్య నుంచి బయటపడేందుకు వజ్రపాత్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. యాండ్రాయిడ్ మొబైల్ ఉన్నవారు గూగుల్ ప్లే స్టోర్ నుంచి వజ్రపాత్ యాప్ ను డౌన్ లోడు చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేయగానే లాంగ్వేజి అడుగుతుంది. ఆ తరువాత మొబైల్ నెంబర్ నమోదు చేయాలి. ఈ నెంబర్ ఆధారంగా లోకేష్ చూపించి ఎరుపు, పసుపు, నారింజ రంగులతో కూడిన వలయాలు కన్పిస్తాయి. ఈ వలయాలలో నెంబర్లు కన్పిస్తాయి. వాటి ఆధారంగా ఎంత సమయంలో పిడుగుపడే అవకాశం ఉందో సమాచారం వస్తుంది. సురక్షితంగా వెళ్లే ప్రాంతాన్ని కూడా చూపిస్తుంది. ఒకవేళ పిడుగుల పడే ప్రమాదం లేనట్లయితే ఈ విషయాన్ని కూడా స్పష్టం చేస్తుంది.

Leave A Reply

Your email address will not be published.