వైద్య చికిత్సా కేంద్రంగా కాశీ: మోదీ

వారణాసి: కాశీ ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా మెడికల్ హబ్ గా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఒకప్పుడు కాశీ ప్రజలు చికిత్స కోసం ఢిల్లీ, ముంబై వెళ్లేవారని అన్నారు. ఇప్పుడు ఇక్కడే వైద్య చికిత్స చేయించుకుంటున్నారని తెలిపారు.
ప్రధాని ఇవాళ వారణాసి నియోజకవర్గంలో పర్యటిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు.

బనారస్ హిందూ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, భక్తులు, ప్రజల భద్రత కోసం కాశీలో 700 సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఘాట్ల వద్ద సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఎల్ఈడి స్క్రీన్లను పెట్టారని, దీని వల్ల పర్యాటకులకు రక్షణ ఉంటుందన్నారు. డిజిల్ బోట్లను సి.ఎన్.జి గా మార్చుతున్నామని, వ్యవసాయదారుల కోసం మౌలికసదుపాయాలు పెంచుతున్నామన్నారు. కరోనా వైరస్ ను అదుపులోకి తెచ్చేందుకు యోగి ప్రభుత్వం చేపట్టిన పోరాటాన్ని ప్రధాని మెచ్చుకున్నారు. ఏమాత్రం రాజీ లేకుండా వైరస్ నిర్థారణ పరీక్షలు నిర్వహిస్తున్నారని, వ్యాక్సిన్లు కూడా ఇస్తున్నారని అన్నారు. విపత్కర సమయంలో ఆగిపోమని, అలసిపోమని కాశీ పట్టణం నిరూపించిందని ఆయన తెలిపారు. కరోనా వైరస్ కారణంగా యావత్ ప్రపంపచం ఇబ్బందులు పడుతోందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

Leave A Reply

Your email address will not be published.