గన్ లైసెన్స్ ఇవ్వండి సార్: ఎమ్మెల్యే రాజాసింగ్

హైదరాబాద్: కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉండి రాష్ట్రంలో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కనీసం గన్ లైసెన్స్ పొందలేకపోతున్నారు. రాష్ట్రంలో బిజెపి ఎమ్మెల్యే కే గన్ లైసెన్స్ దొరడం లేదంటే ఆ పార్టీ పలుకుబడి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
తనకు గన్ లైసెన్స్ ఇవ్వాలని ఎమ్మెల్యే రాజాసింగ్ ఇవాళ డిజిపి ఎం.మహేందర్ రెడ్డి ని కలిసి వినతి పత్రం అందచేశారు. దీంతో పాటు మరో రెండు అంశాలను కూడా చేర్చారు. మల్లేపల్లి లో ఇస్లామిక ఉగ్రవాదులు పట్టుబడిన నేపథ్యంలో దాడులు నిర్వహించాలని కోరారు. గోవధను ప్రోత్సహిస్తున్న ఎంఐఎం ఎం.పి అసదుద్దీన్ ఓవైసిపై చర్యలు తీసుకోవాలని డిజిపి కి తెలిపారు.

తనకు గన్ లైసెన్స్ ఇవ్వాలని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ కు సిఎం కెసిఆర్ ఫఓన్ చేప్పినా ఇవ్వడం లేదన్నారు.
రాష్ట్రంలో బిజెపి ప్రజా ప్రతినిధులకు అధికారులు, పోలీసు యంత్రాంగం ఏమాత్ర విలువ ఇవ్వడం లేదు. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా సిద్ధిపేట పోలీసు కమిషనర్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పై చేయి చేసుకున్నాడు. అంతకు ముందు కరీంనగర్ లో మరో పోలీసు అధికారి చేయి చేసుకున్నాడు. పోలీసుల చర్యలపై బండి సంజయ్ పార్లమెంట్ స్పీకర్ కు ఫిర్యాదు చేసి నెలలు గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. హైదరాబాద్ లో కేంద్ర హోం శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డికి ప్రొటోకాల్ ఇవ్వడం లేదు. ఏ అధికారికి ఫోన్ చేసినా స్పందించడం లేదు. ఇలా బిజెపి ప్రజా ప్రతినిధులకు వరుస పరాభవాలు జరుగుతున్నాయంటూ కార్యకర్తలే చర్చించుకుంటున్నారు. లోపాయకారి పొత్తుల మూలంగానే ఈ దుస్థితి అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.