మైనర్ బాలికపై అత్యాచారం, అరెస్టు
హైదరాబాద్: వనస్థలిపురం లో మైనర్ బాలిక(13)పై అత్యాచారం చేశారు. నిన్న రాత్రి 8 గంటల సమయంలో వనస్థలిపురం కాంప్లెక్స్ వద్ద మైనర్ బాలిక నడుచుకుంటూ వెళ్తుండగా ఒక యువకుడు బలవంతంగా బైక్ పై తీసుకెళ్లాడు.
గంజాయి మత్తులో ఉన్న యువకుడు మైనర్ బాలిక ను వేరే ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. ఈరోజు ఉదయం వనస్థలిపురంలో అమ్మాయిని వదిలేశాడు. ఇంటికి చేరుకున్న తరువాత అమ్మాయి తనపై జరిగిన అత్యాచారం విషయం చెప్పడం తో తల్లిదండ్రులు నేరుగా వనస్థలిపురం పోలీసు స్టేషన్ కు తీసుకువెళ్లారు. బాధిత బాలికతో పోలీసులకు ఫిర్యాదు చేయించగా, కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి పై బాలిక తల్లి అనుమానం వ్యక్తం చేయడంతో వారికోసం గాలింపు చేస్తున్నారు.