జూబ్లిహిల్స్ లో ఎంఐఎం గుండాగిరి

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్, ఎంఐఎం నాయకుడు మాజీద్ హుస్సేన్ పోలీసులపైకి దాడికి తెగబడే ప్రయత్నం చేశాడు. తనకు సంబంధం లేని ఒక భూ వివాదంలో మాజీద్ జోక్యం చేసుకున్నాడు. జూబ్లిహిల్స్ రోడ్డు నెంబర్ 87 లో ప్లాట్ నెంబర్ 473కె ను మాజీ మేయర్ మాజీద్, నానాల్ నగర్ కార్పొరేటర్ నాసిర్, మరో 20 మంది గుండాలు విక్రయించేందుకు సిద్ధమయ్యారు.

పేరు మోసిన ల్యాండ్ గ్రాబర్ ముస్తఫా కమాల్ సిద్ధిఖీ దీని వెనకాల ఉండి కుట్ర చేస్తున్నాడని ప్లాట్ యజమాని సిహెచ్.నిఖిల్ రెడ్డి ఆరోపించారు. తప్పుడు పత్రాలు రూపొందించి తన స్థలం కబ్జా చేసి, విక్రయిస్తున్నారని ఆయన ఆరోపించారు. స్థల యజమాని నిఖిల్ రెడ్డి ఫిర్యాదుతో పోలీసులు అక్కడకు చేరుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేయగా ఎంఐఎం నాయకుడు మాజీద్ పోలీసులపైకి వెళ్లే యత్నం చేశాడు. మితిమీరి ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించడంతో గుండాలు, ఎంఐఎం నాయకులు వెనక్కి తగ్గారు.

Leave A Reply

Your email address will not be published.