నేను పెళ్లి చేసుకోవడం లేదు: మెహరీన్
తమిళ, తెలుగు చిత్రాలలో నటిస్తున్న మెహరీన్ ఫిర్జాదా తన వివాహాన్ని రద్దు చేసుకున్నది. భవ్య బిష్ణోయ్ తో వివాహం జరగడం లేదని, ఇద్దరం కలిసి సమిష్ఠిగా నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ప్రకటించింది.
హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు భవ్య బిష్ణోయ్ తో ఆమెకు ఎంగేజ్ మెంట్ జరిగిన విషయం తెలిసిందే. అయితే మా బంధం పెళ్లి వరకు వెళ్లడం లేదని, ఇద్దరం కలిసి ఎంగేజ్ మెంట్ ను విరమించుకోవాలని నిర్ణయించుకున్నట్లు మెహరీన్ ట్వీట్ చేసింది. ఇద్దరం స్నేహపూర్వకంగా నిర్ణయం తీసుకున్నామని, ఇప్పటి నుంచి ఆ కుటుంబంతో తనకేలాంటి సంబంధాలు ఉండవని స్పష్టం చేసింది. ఇది పర్సనల్ విషయం అని, అందరూ గౌరవిస్తారని భావిస్తున్నట్లు పేర్కొంది. ఇక నుంచి నటనపై దృష్టి పెడతానని, పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను కొనసాగిస్తానని మెహరీన్ ఫిర్జాదా ట్వీట్ చేసింది.