15 నుంచి మెడెర్నా వ్యాక్సినేషన్
న్యూఢిల్లీ: దేశంలో మరో వ్యాక్సిన్ ను ప్రజలకు ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. అమెరికాకు చెందిన మోడెర్నా వ్యాక్సిన్ కు అత్యవసర వినియోగం కింద కేంద్ర ప్రభుత్వం అనుమతించింది.
జూలై 15వ తేదీ నుంచి ప్రభుత్వ ఆసుపత్రులలో అందుబాటులోకి రానున్నది. గతవారం కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ (సి.డి.ఎఫ్.డి) అనుమతులు మంజూరు చేసింది. అయితే తొలి 100 మంది లబ్ధిదారులకు సంబంధించిన 7 రోజుల ఆరోగ్య పరిస్థితిని సమర్పించాలన షరతు విధించింది. ఈ వారం చివరి నాటికి మోడెర్నా డోసులు దిగుమతి వచ్చే మరో వారం రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు చేర్చాలని సిప్లా ఫార్మా లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నది. అయితే వ్యాక్సిన్ ఒక డోసు ధరను ఇంత వరకు అధికారికంగా ప్రకటించలేదు.