లైంగిక వేధింపులు సత్యదూరం: టి సిరీస్ ఎండి

ముంబయి: దేశంలో ప్రముఖ ఆడియో కంపెనీ టి సిరీస్ మేనేజింగ్ డైరెక్టర్ భూషణ్ కుమార్ పై వచ్చిన అత్యాచార సత్యదూరమని ఆ కంపెనీ తోసిపుచ్చింది. తమ వద్ద ఆధారాలు కూడా స్పష్టం చేసింది.

కంపెనీలో వర్క్ ఇస్తానని చెప్పి మూడేళ్లు అనుభవించాడని, వేధింపులకు గురి చేశాడని ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. భూషణ్ పై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని, ఆమె గతంలో సినిమా, మ్యూజిక్ వీడియోల కోసం టి సిరీస్ బ్యానర్ పై పనిచేసిందన్నారు. ఈ ఏడాది మార్చి నెలలో వెబ్ సిరీస్ చేయాలనుకున్న ఆ మహిళ డబ్బుల కోసం రాగా భూషణ్ సున్నతంగా తిరస్కరించారు. జూన్ లో మరోసారి వచ్చి డబ్బులు డిమాండ్ చేసింది. ఆమె విన్నపాన్ని తిరస్కరించడంతో దోపిడి చేసేందుకు కూడా ప్రయత్నించి విఫలమైంది. జూలై 1వ తేదీన లోకల్ పోలీసులకు ఫిర్యాదు చేశామని, ఆమెకు సంబంధించిన ఆడియో క్లిప్పులు కూడా ఉన్నాయని టి సిరీస్ స్పష్టం చేసింది.

Leave A Reply

Your email address will not be published.