యుఎస్ అంబాసిడర్ గా లాస్ ఏంజెల్స్ మేయర్

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ ఆర్.బైడెన్ ఇండియా అంబాసిడర్ గా లాస్ ఏంజెల్స్ మేయర్ అయిన ఎరిక్ గార్సెట్టి ని నామినేట్ చేశారు. అమెరికన్ సెనెట్ ధృవీకరిస్తే ఇండియాలో అంబాసిడర్ బాధ్యతలు స్వీకరించనున్నారు.

ప్రస్తుత అంబాసిడర్ కెన్నత్ జస్టర్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో నియమితులయ్యారు. ఆయన స్థానంలో ఎరిక్ రానున్నారు. ఎరిక్ 2013 సంవత్సరం నుంచి లాస్ ఏంజెల్స్ మేయర్ గా, 12 సంవత్సరాల పాటు సిటీ కౌన్సిల్ మెంబర్ గా పనిచేశారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం చేసేందుకు తనకు అత్యంత నమ్మకస్తుడు ఎరిక్ ను ఇండియా అంబాసిడర్ గా బైడెన్ నామినేట్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.