సెల్ఫీ పై పిడుగు… 11 మంది దుర్మరణం
జైపూర్: కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో జనాలు సెలవు రోజుల్లో బయటకు వస్తున్నారు. నగరంలోని అమేర్ ప్యాలెస్ వాచ్ టవర్ ను వీక్షించేందుకు ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. సెల్ఫీలు తీసుకుంటున్న సమయంలో భారీ పిడుగు పడి 11 మంది అక్కడికక్కడే చనిపోయారు.
పిడుగు కారణంగా మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. పిడుగు ధాటికి పలువురు పక్కనున్న లోయలో పడి చనిపోవడం విషాదకరం. క్షతగాత్రులను విపత్తు సిబ్బంది బయటకు తీసుకువచ్చి ఆసుపత్రికి తరలించారు. వాతావరణం చల్లగా ఉండడం, జోరుగా వర్షం పడుతుండడంతో వాచ్ టవర్ వద్ద జనం పెద్ద ఎత్తున నిల్చుని సెల్పీలు తీసుకున్నారు.