బాలీవుడ్ ప్రముఖ నటుడు కన్నుమూత
ముంబయి: ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ (98) తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం బారిన పడడంతో ఇవాళ ఉదయం 7.30 కు చనిపోయినట్లు ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు.
శ్వాస సంబంధిత వ్యాధితో ఆయన హిందుజా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తుల్లో చేరిన నీటిని తొలగించారు. దిలీప్ కుమార్ ఆరోగ్యం బాగుపడిందని ఆయన భార్య సైరభాను ట్విటర్ వేదికగా ప్రకటించారు కూడా. మళ్లీ అనారోగ్యం బారిన పడ్డ ఆయన చికిత్స పొందుతూ ఉదయం చనిపోయారు.