గులాబి కండువా గొడ్డలి లాంటిది

హైదరాబాద్: నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు ఎర్ర శేఖర్, భూపాలపల్లి సీనియర్ లీడర్ గండ్ర సత్యనారాయణ ఇవాళ పిసిసి అధ్యక్షుడు ఏ.రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.
రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని, కాంగ్రెస్ పార్టీ లో చేరేందుకు సుముఖంగా ఉన్నామని వారు తెలిపారు. త్వరలో బహిరంగ సభలు పెట్టి పార్టీలో చేరుతామని ప్రకటించారు. రేవంత్ తో భేటీ తరువాత మీడియాతో మాట్లాడారు. మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయినందుకు మనస్ఫూర్తిగా అభినందించానన్నారు.

కాంగ్రెస్ లో పుట్టి పెరిగా.. కొన్ని కారణాల వల్ల వెళ్లానన్నారు. మా నాన్న డి.శ్రీనివాస్ కోసమే మధ్యలో టిఆర్ఎస్ లో చేరానన్నారు. గులాబి కండువా ఒక గొడ్డలి లాంటిదని, ఎదుగుదల ఉండదనన్నారు. అది రాజకీయ పార్టీ కాదని, ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ అన్నారు. జిల్లా ప్రెసిడెంట్ కు గుర్తింపు లేదని, రేవంత్ నాయకత్వాన్ని బలపరచడం కోసం తిరిగి కాంగ్రెస్ కు వస్తున్నానన్నారు. త్వరలో ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దల సమక్షంలో చేరుతానని, కాంగ్రెస్ కు పూర్వ వైభవం వస్తుంది. మహబూబ్ నగర్ జిల్లా బిజెపి అధ్యక్షుడు ఎర్ర శేఖర్ మాట్లాడుతూ, బిజెపి సభ్యత్వానికి, జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. బిజెపి కి రాజీనామా చేయడానికి గల కారణాలు చాలా ఉన్నాయన్నారు. త్వరలో కాంగ్రెస్ లో చేరుతున్నట్లు సత్యం తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.